ప్రస్తుతం బాలీవుడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రాల్లో సెన్సేషనల్ మల్టీస్టారర్ చిత్రం “వార్ 2” కూడా ఒకటి. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు మరికొన్ని రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతుంది.
ఈ సినిమా విషయంలో ఒక సందేహం మాత్రం చాలా మందిలో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఉండొచ్చు. ఇద్దరు హీరోస్ ఉన్నారు దర్శకుడు ఎవరిని ఎలా చూపించి ఉంటాడు అనేది సస్పెన్స్ గా మారింది. కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుకి క్రేజీ ట్రీట్ ఇచ్చేలా సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది.
వార్ 1 లో మెయిన్ లీడ్ హృతిక్ అయినప్పటికీ వార్ 2 లో డామినేషన్ మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ దే అని తెలుస్తుంది. మరి ఇది కానీ నిజమైతే తారక్ అభిమానులకి పండగే అని చెప్పాలి. ఇక ఈ అవైటెడ్ సినిమా ఈ అగస్ట్ 14న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.