ప్రస్తుతం ఓటిటిలు మన ఇండియాలో కూడా ఆడియెన్స్ కి ఎంతలా రీచ్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అలా మన తెలుగు నుంచి కూడా పలు ఓటిటి యాప్స్ ఆడియెన్స్ కి అలరించేందుకు వచ్చాయి. మరి ఇలా మన తెలుగు నుంచి వచ్చిన మొదటి స్ట్రీమింగ్ యాప్ నే “ఆహా”. అల్లు సంస్థ నుంచి వచ్చిన ఈ ఓటిటి యాప్ ఆనతి కాలంలోనే మంచి ఆదరణ అందుకుంది.
అలాగే పలు ఒరిజినల్ సినిమాలు, సిరీస్ లతో లాక్ డౌన్ సమయం నుంచి ఇపుడు సాలిడ్ ట్రీట్ అందించగా ఇపుడు వీరి నుంచి ఒక సెన్సేషనల్ అనౌన్సమెంట్ వచ్చింది. “సీఎం పీకే” అంటూ ఒక పోస్టర్ ని వదిలి అందరిలో ఆసక్తి రేపారు. మరి మన టాలీవుడ్ లో పీకే అంటే మొట్ట మొదటిగా స్ట్రైక్ అయ్యే పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
పైగా పవన్ పాలిటిక్స్ లో ఉండడంలో సీఎం పీకే అనేది పెద్ద పదమే ఇపుడు. దీనితో ఇలాంటి ట్యాగ్ ని అనౌన్స్ చేసి అతి త్వరలోనే ఒక పవర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని తీసుకొస్తున్నట్టుగా ఆహా వారు చెబుతున్నారు. మరి ఈ టైటిల్ వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఏంటి అనేది ముందు రోజుల్లో చేస్తుంది.
Make way for the most powerful entertainment, coming soon on Aha! #CMPKonAha pic.twitter.com/2Xnpx6gWio
— ahavideoin (@ahavideoIN) February 9, 2025