డబ్బింగ్ సిరియల్స్ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం రోజురోజుకు వేదేక్కితుంది. తెలుగు టెలివిషన్ పరిశ్రమ పరిరక్షణ సమితి తీసుకున్న కార్యాచరణ భాగంగా మార్చ్ 15 శుక్రవారం నాడు పంజాగుట్ట లో నున్న మా టీవీ ఆఫీసు ఎదురుగా నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా టీవీ కళాకారులు సాంకేతికా నిపుణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా టీవీ యాజమాన్యానికి మరో సారి తమ డిమాండ్స్ ను చెప్పారు. ఉగాది లోగా మా టీవీ లో ఎలాంటి డబ్బింగ్ సీరియల్స్ ప్రసారం చేయకూడదని ఒక వేల చేసినట్లైతే టీవీ పరిశ్రమ నుండి ఈలాంటి సహాయ సహకారాలు ఉండబోవని ముక్తకంతంతో తెలిపారు.ఆ తరువాత అక్కడనుండి ఖైరతాబాద్ లోనున్న జీ తెలుగు ఛానల్ ఆఫీసుకు, ఆర్ వి యస్ ఛానల్ కు కూడా బృందంగా వెళ్లి తమ డిమాండ్స్ ని తెలిపారు.