ఈసారి బన్నీ సెన్సేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయ్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో”. బన్నీకు ఒక సాలిడ్ హిట్ తగిల్తే ఆ సెన్సేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో నిరూపించిన సినిమా ఇది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలయ్యి ఒక్క బిగ్ స్క్రీన్ మీదనే కాకుండా ఈ సినిమా పడ్డ ప్రతీ చోటా కూడా భారీ స్థాయి రికార్డులను సెట్ చేసింది.

అదే విధంగా మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై కూడా ఆల్ టైం రికార్డును సెట్ చేసింది. మొట్టమొదటి సరి టెలికాస్ట్ లో 29 పైగా టీఆర్పీ ను అందుకున్న బన్నీ ఈసారి సెకండ్ టెలికాస్ట్ లో కూడా అంతే స్థాయి రెస్పాన్స్ ను అందుకోవడం ఖాయం అని అభిమానులు అంటున్నారు. అంతే కాకుండా నిన్న దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చెయ్యడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు మరింత రీచ్ అయ్యినట్టు తెలుస్తుంది.

దీనితో మరోసారి కూడా బన్నీ సెన్సేషన్ గట్టిగానే ఉంటుందని గట్టి టాక్ వినిపిస్తుంది. అలాగే ఈసారి యావరేజ్ గా 12 నుంచి 15 టీఆర్పీ కూడా వచ్చే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈసారి బంటు గాడి హవా ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా గీత ఆర్ట్స్ మరియు హారికా హాసిని వారు నిర్మాణం వహించారు.

Exit mobile version