“బిగ్ బాస్ 4” మేకర్స్ మళ్ళీ తలనొప్పి మొదలయ్యిందట!

“బిగ్ బాస్ 4” మేకర్స్ మళ్ళీ తలనొప్పి మొదలయ్యిందట!

Published on Nov 6, 2020 4:03 PM IST

మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ఇప్పుడు నాలుగో సీజన్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి కూడా కింగ్ నాగార్జునే మళ్ళీ హోస్ట్ గా చెయ్యడంతో అంతకు మించిన అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే మొట్టమొదటి గ్రాండ్ ఎపిసోడ్ భారీ స్థాయి టీఆర్పీ ను కొల్లగొట్టేసింది. ఇక అక్కడ నుంచి అసలు సమస్య మేకర్స్ కు మొదలయ్యింది.

వీకెండ్స్ లో అంటే ఓకే కానీ వీక్ డేస్ లో మాత్రం వీక్ గానే టీఆర్పీలు రావడంతో మేకర్స్ తలలు పట్టుకున్నారు. కానీ ఆ వెంటనే ఆ లోటును భర్తీ చేసేందుకు ఎప్పుడు పెట్టాల్సిన వైల్డ్ కార్డు ఎంట్రీలను ముందుగానే చేసేసి సక్సెస్ అయ్యారు. అక్కడ నుంచి వీక్ డేస్ లో కూడా యావరేజ్ గా మంచి రేటింగ్ ను తెచ్చుకొనేది. కానీ ఇప్పడు మాత్రం అది షరా మామూలే అయ్యిపోయినట్టు తెలుస్తుంది.

గత వారం సమంతా హోస్ట్ చేసిన ఎపిసోడ్ మినహాయిస్తే మిగతా అన్ని రోజులు రేటింగ్స్ సోసో గానే వచ్చాయట. కంటెస్టెంట్స్ నుంచి కూడా అనుకున్న స్థాయి పెర్ఫామెన్స్ కనిపించకపోవడం ఇందుకు కారణం అని తెలుస్తుంది. దీనితో మళ్ళీ పడిపోయిన రేటింగ్ ను లేపడానికి మేకర్స్ ముందుకు కొత్త ఛాలెంజ్ రావడంతో పాటుగా మళ్ళీ తలనొప్పి మొదలయ్యినట్టయ్యింది.

తాజా వార్తలు