ఎన్టీఆర్ ని ఆపడం ఎవరి వల్లా కాలేదు..!

ఎన్టీఆర్ ని ఆపడం ఎవరి వల్లా కాలేదు..!

Published on Jul 22, 2020 11:01 PM IST

ఎంతటి స్టార్ హీరోకైనా ఒక దశలో పరాజయాలు తప్పవు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కూడా కెరీర్ లో వరుస పరాజయాలు ఎదురయ్యాయి. బృందానం మూవీ తరువాత ఎన్టీఆర్ చేసిన శక్తి, ఊసరవెల్లి మరియు దమ్ము చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయాయి. దీనితో దూకుడు మూవీతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రీను వైట్లతో బాద్షా మూవీ చేశారు ఎన్టీఆర్. ఆ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకొని కొంచెం ఉపశనం కలిగించింది. ఆ చిత్రం తరువాత వచ్చిన రామయ్యా వస్తావయ్యా, రభస ప్లాప్స్ గా మిగిలాయి.

ఆ సమయంలో ఎన్టీఆర్ అనూహ్యంగా ఫార్మ్ లో లేని పూరి జగన్నాద్ తో టెంపర్ మూవీకి కమిటయ్యాడు. అది కూడా నెగెటివ్ షేడ్స్ ఉండే…పోలీస్ రోల్. కానీ ఎన్టీఆర్ పెట్టుకున్న నమ్మకం నిలబెడుతూ ఆ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ నటవిశ్వరూపాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం, టెంపర్. ఆ తరువాత ఆయన చేసిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ మరియు అరవింద సమేత వరుస హిట్స్. టెంపర్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఎన్టీఆర్ ని ఆపడంఎవరి తరం కాలేదు.

తాజా వార్తలు