ఈరోజు నిజంగానే మెగా ఫ్యాన్స్ కు ఓ దుర్దినం అనే చెప్పాలి. ఈరోజు ఉదయమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది అని తెలపడంతో ఇండస్ట్రీ మరియు వారి అభిమానులు త్వరగా తగ్గాలని కోలుకున్నారు. అలాగే తాను రీసెంట్ గా ఎవరెవరిని కలిసానో వాళ్ళు అంతా కూడా టెస్ట్ చేయించుకోవాలని చరణ్ తెలిపారు.
ఇపుడు ఇదే వార్త ఇలా ఉండగా మెగా బ్రదర్ నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తెలిపారు.చరణ్ కు పాజిటివ్ వచ్చినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు. కానీ వరుణ్ స్వల్పంగా లక్షణాలు ఉన్నాయని అలాగే ప్రస్తుతం క్వారంటైన్ లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాని తెలిపాడు. అలాగే తాను కరోనాను జయించి తిరిగి వస్తానని ఈ వార్తను అధికారికంగా వెల్లడి చేసాడు. ఈరోజు మాత్రం మెగా ఫ్యాన్స్ కు బ్యాక్ కు టు బ్యాక్ బ్యాడ్ న్యూస్ లే అని చెప్పాలి. మరి వరుణ్ కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.
— Varun Tej Konidela (@IAmVarunTej) December 29, 2020