నిన్న రజనీకాంత్ ఇప్పుడు అక్షయ్ కుమార్

మ్యాన్ వెర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో ఇండియా సెలబ్రిటీలు చాలా ఇష్టంగా పాల్గొంటున్నారు. గతంలో ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొనగా రెండు రోజుల క్రితమే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఆయన కర్ణాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నందు షూటింగ్ చేశారు. ఈ షో త్వరలోనే ప్రసారంకానుంది.

ఇక రజనీ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ షోలో పాల్గొననున్నారు. ఆయన కూడా రజనీకాంత్ మాదిరిగానే బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోనే బేర్ గ్రిల్స్ తో కలిసి షూటింగ్ చేయనున్నారు. మొదట రజనీకాంత్ షో ప్రసారమైన తర్వాత అక్షయ్ కుమార్ షో ప్రసారం కానుంది. ఈ రెండు షోల కోసం రజనీ, అక్షయ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Exit mobile version