పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా మళ్ళీ తెలుగు స్టేట్స్ లో ఓ రేంజ్ లో కనిపిస్తుంది. హైప్ లేదు అనుకుంటున్న సమయంలోనే ప్రీమియర్స్ తో భారీ హైప్ ని అందుకున్న ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ ని లాక్ చేసుకుంది. అయితే హరిహర వీరమల్లు సినిమా నిన్న రాత్రి ప్రీమియర్స్ కే దద్దరిల్లే రెస్పాన్స్ ఫ్యాన్స్ నుంచి వచ్చింది.
అయితే ఇదంతా మొదటి నుంచి పెద్దగా హైప్ లేని సినిమాకే కావడం గమనార్హం అయితే మొదటి నుంచీ ఒక ఊహించని రేంజ్ హైప్ ఉన్న “ఓజి” సినిమాకి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. దర్శకుడు సుజీత్ తో అనౌన్స్ చేసిన “ఓజి” పై అంతకు మించి హైప్ నెలకొంది. మరి ఓజి రిలీజ్ నాటికి తెలుగు రాష్ట్రాల్లో ధాటి తట్టుకోవడం ఒకింత పెద్ద టాస్క్ అనే చెప్పవచ్చు. ఇక ఈ అవైటెడ్ చిత్రానికి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాది సెప్టెంబర్ 25న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.