మన స్టార్ హీరోలు ఫేమ్ వాడుకొని చాలా మంది క్యాష్ చేసుకోవాలని చూస్తారని అందరికీ తెలిసిందే. అయితే అఫీషియల్ గా ఆ స్టార్స్ ని పెట్టుకొనే పలు బ్రాండ్స్ లాంటివి ఇన్నాళ్ల పాటు అగ్రిమెంట్ అని పలు అడ్వార్టైజ్మెంట్ లు చేస్తూ ఉంటారు. ఇవి అధికారికం కానీ అనధికారికంగా స్టార్స్ ముఖచిత్రాలు, మాటలు ఇలా పలు మార్గాల్లో కూడా క్యాష్ చేసుకునే పనిలో ఇంకొందరు ఉంటారు. మరి వాటిపై సదరు స్టార్స్ యాక్షన్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇందులో భాగంగా లేటెస్ట్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కోర్టుని ఆశ్రయించినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.
ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన తారక్..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) తన పేరు, ఫోటో, మాట, సంతకం లాంటి వాటిని ఎవరూ అనధికారికంగా వాడడానికి లేదని తన వ్యక్తిగత హక్కుగా దాఖలు చేసినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. సో తన పర్మిషన్ లేనిదే తన పేరిట బయట ఎవరైనా ఏదైనా చేస్తే వారిపై చర్య తీసుకునే హక్కు ఎన్టీఆర్ కి ఇపుడు ఉంటుంది.
రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి కూడా
కొన్నాళ్ల కితమే ఇదే విధంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా దాఖలు చేశారు. తన పేరు మీద అనధికారిక వినియోగం జరిగితే చర్యలు తప్పవు అన్నట్టే స్మూత్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే చిరంజీవి పర్మిషన్ తీసుకొని రెస్టారెంట్ లు కూడా నడుపుకుంటున్న వారూ లేకపోలేరు.
వీరు కాకుండా వేరే స్టార్స్ ఉన్నారా?
ఇపుడు ఎన్టీఆర్, చిరంజీవి కాకుండా కింగ్ నాగార్జున అలాగే మంచు మోహన్ బాబులు కూడా ఉన్నారట.
