టాలీవుడ్లో తెరకెక్కిన స్పై యాక్షన్ చిత్రం ‘గూఢచారి’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ టిక్క డైరెక్ట్ చేయగా అడివి శేష్ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్గా ‘గూఢచారి 2’ను మేకర్స్ ఎప్పటినుంచో తెరకెక్కిస్తున్నారు.
అయితే, G2 గా ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొల్పిన గూఢచారి 2 చిత్రం నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని సినీ లవర్స్ చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి ఓ సాలిడ్ అప్డేట్ని అయితే మేకర్స్ అందించారు. గూఢచారి 2 చిత్ర రిలీజ్ డేట్ను వారు తాజాగా అనౌన్స్ చేశారు.
2026 వేసవి కానుకగా మే 1న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ వారు కొన్ని పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాను వినయ్ కుమార్ సింగినీడి డైరెక్ట్ చేస్తుండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో వామికా గబ్బి, సుప్రియ యార్లగడ్డ, మధు శాలిని, ప్రకాశ్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.