హీరో అడివి శేష్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘డెకాయిట్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. షనీల్ డియో డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ఇక ఈ సినిమాతో అడివి శేష్ మరోసారి తనదైన మార్క్ హిట్ కొట్టడం ఖాయమని చిత్ర వర్గాలు ఆశిస్తున్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితులు ఈ చిత్రానికి ప్రతికూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ అనుకున్నదానికంటే చాలా ఆలస్యంగా అవుతోందట. ఇటీవల అడివి శేష్ కాలికి గాయం కావడంతో ఆయన కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని.. దీంతో ఆయన ఈ చిత్ర షూటింగ్లో పాల్గొనడం ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ చేయాల్సి ఉందని చిత్ర వర్గాల టాక్. ఇక ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ఈ మూవీ క్రిస్మస్ కానుకగా రావడం కష్టమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
దీంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో రానున్నట్లు సినీ సర్కిల్స్ టాక్. మరి నిజంగానే డెకాయిట్ చిత్రం వాయిదా పడుతుందా అనేది చూడాలి. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.