‘అడ్డా’విషయంలో హ్యాపీగా ఉన్న టీం

Adda
సుశాంత్ హీరోగా శాన్వీ హీరోయిన్ గా నటించిన ‘అడ్డా’ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సందర్బంగా సుశాంత్, శాన్వీ, ఈ సినిమా నిర్వాహకులు ఈ రోజు మీడియాతో మాట్లాడారు. వారి సంతోషాన్ని తెలియజేశారు. ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. నలుగు సంవత్సరాల తరువాత నాకు మంచి విజయం లబించింది. నేను ఈ సందర్బంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఓపినింగ్ కలెక్షన్స్ మేము అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చాయి’ అని సుశాంత్ అన్నాడు. శాన్వీ, నిర్మాత చింతలపూడి శ్రీనివాస్ రావు, అక్కినేని నాగ సుశీల, డైరెక్టర్ కార్తీక్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ వారి సంతోషాన్ని తెలియజేశారు.

Exit mobile version