అర్ధరాత్రి లేపి అడిగినా డైలాగ్స్ చెప్తానంటున్న పూరి హీరోయిన్

adah-sharma
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తను డైరెక్ట్ చేసిన సినిమాల ద్వారా చాలా మంది కొత్త హీరోయిన్స్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్ లో రానున్న సినిమా ‘హార్ట్ ఎటాక్’. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా పూరి ఆద శర్మని హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయనున్నాడు. ఆద శర్మ హార్ట్ ఎటాక్ సినిమా అతనకి మంచి పేరు తెస్తుందని చాలా నమ్మకంగా ఉంది.

ఆద శర్మ ఈ సినిమా విశేషాల గురించి చెబుతూ ‘పూరి గారి సినిమాతో టాలీవుడ్ లో పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. పూరి గారు సినిమాలో డైలాగ్స్, సన్నివేశాలు నాకు బాగా అర్థం కావాలని రెండు నెలల ముందే నా డైలాగ్స్ స్క్రిప్ట్ నాకిచ్చేసారు. నేను ముంబైలో ఓ తెలుగు ట్యూటర్ ద్వారా అన్ని డైలాగ్స్ బాగా నేర్చుకున్నాను. ఎలా అంటే ఎవరన్నా అర్ధరాత్రి నిద్ర లేపి డైలాగ్స్ చెప్పమన్నా చెప్పేసేంతగా.. అలాగే ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నాకు మాత్రం మంచి పేరు వస్తుంది. దాంతో తెలుగులో మరిన్ని అవకాశాలు వాస్తాయన్న నమ్మకం ఉందని’ చెప్పింది.

అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన హార్ట్ ఎటాక్ సినిమా ఆడియోని త్వరలోనే రిలీజ్ చేసి 2104 జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version