నాగార్జున రాబోతున్న చిత్రం “భాయ్” లో నాగార్జున సరసన ఎవరు నటించబోతున్నారు అనే విషయం మీద గత కొన్ని రోజులుగా పలు వార్తలు వినబడుతూ వస్తుంది. వీరభద్రం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మించనున్నారని సమాచారం. కొద్ది వారాల క్రితం వీరభద్రం ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం రిచా గంగోపాధ్యాయ్ ని సంప్రదించినట్టు పుకారు వచ్చింది తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం బాలివుడ్ నటి అదా శర్మని అనుకుంటున్నారు. ఈ నటి గతంలో విక్రం భట్ “1920” అనే హర్రర్ చిత్రంలో కనిపించింది. లిమ్కా, ఒలే, నోకియా మరియు పారాచ్యుట్ ఆయిల్ వారి యాడ్స్ లో కనిపించింది. ఈమె ఇంకా ఈ చిత్రం కోసం సంతకం చెయ్యలేదు కాని ఈ పాత్ర కోసం ఈ నటినే తీసుకుంటారని బలమయిన సమాచారం. మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.