ఈరోజు(జనవరి 4)తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సంచలనాత్మక చిత్రం ‘అత్తారింటికి దారేది’ శతదినోత్సవ సంబరాలు జరుపుకోనుంది. సినిమా విడుదలకు ముందే పైరసీ భూతం కాటేసీనా తెలుగు సినిమా రంగం అండతో, అభిమానుల ప్రోద్బలంతో సినిమా కష్టాలన్నిటినీ ఎదుర్కుని టాలీవుడ్ కే భారీ గ్రాసర్ గా నిలిచింది
ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. సమంత, ప్రణీత హీరోయిన్స్. మునుపటి తరం నటి నదియా సినిమాలో కీలకమైన అత్త పాత్రలో జీవించింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు దేవి అందించిన సంగీతం అదనపు బలంగా నిలిచింది
ఈ సంధర్భంగా 123తెలుగు నుండి ‘అత్తారింటికి దారేది’ బృందానికి మా శుభాకాంక్షలు.