నటి మాధవీలత అప్పుడప్పుడూ సామజిక విషయాలపై స్పందిస్తూ తన మార్కు కామెంట్స్ తో వార్తలలో ఉంటారు. రాజకీయ పరిస్థితులు మరియు సోషల్ ఇష్యూస్ పై ఆమె మాట్లాడుతూ ఉంటారు. మీటూ విషయంలో కూడా మాధవీలత తన వాదన వినిపించారు. ఐతే ఆమె తాజాగా తన అధికారిక పేస్ బుక్ అకౌంట్ లో తనకు చచ్చిపోవాలని ఉంది…అని అర్థం వచ్చేలా ఓ పోస్ట్ పెట్టారు. దీనితో మాధవి లతకు ఏమైంది? ఎందుకు ఇలాంటి పోస్టులు పెడుతుంది? బహుశా ఆమె డిప్రెషన్ లో ఉన్నారా? అంటూ మాధ్యమాలలో అనేక కథనాలు రావడం జరిగింది.
వరుస కథానాలతో విసుగెత్తిపోయిన మాధవీలత ఎట్టకేలకు తాను పెట్టిన పోస్ట్ పై స్పందించారు. అనారోగ్య కారణాలతో మెడిసిన్ వాడుతున్నానని, మెడిసిన్ తినడం నావల్ల కావడం లేదు, చచ్చిపోవాలని ఉంది అని నేను వేరే అర్థంలో అలా పోస్ట్ పెట్టాను. అంతే కానీ నిజంగా నాకు అలాంటి ఆలోచనలు లేవు, మీరు ఇంకా దీనిపై కథనాలు మానేస్తే మంచిది అని వివరణ ఇచ్చారు. తెలుగులో మాధవీలత ‘నచ్చావులే’ తో పాటు, నాని హీరోగా వచ్చిన హిట్ మూవీ ‘స్నేహితుడా’ చిత్రాలతో హీరోయిన్ గా నటించింది.