విలక్షణ నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు గుండె నొప్పి వల్ల హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన కేర్ హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. మీడియా ప్రతినిధుల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగుందని అంత సీరియస్ ఏమీ లేదని మరియు త్వరలోనే కోలుకుంటాడని చెబుతున్నారు.
రాజేంద్ర ప్రసాద్ గారు ఇటీవలే అల్లు అర్జున్ నటించిన ‘జులాయి’ చిత్రంలో కనిపించి ఆయన నటనకు మంచి పేరు తెచ్చుకున్నారు. 1980 మరియు 1990 లలో ఆయన తన కామెడీ సినిమాలతో ఎన్నో విజయాలను అందుకొని ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.
రాజేంద్ర ప్రసాద్ గారు త్వరగా కోలుకోవాలని 123తెలుగు.కామ్ కోరుకుంటోంది.