ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన రాజశేఖర్

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన రాజశేఖర్

Published on Nov 9, 2020 8:02 PM IST


సీనోయర్ నటుడు, హీరో డాక్టర్ రాజశేఖర్ కరోనాకు గురైన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు కుటుంబ మొత్తానికి కోవిడ్ సోకింది. దీంతో రాజశేఖర్ ఆయన సతీమణి హీవితా రాజశేఖర్ ఇద్దరూ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. జీవితా రాజశేఖర్ తీవ్రగానే కోలుకున్నారు కానీ రాజశేఖర్ హెల్త్ కండిషన్ మాత్రం కొద్దిగా సీరియస్ అయింది. వైరస్ అటాక్ ఎక్కువ కావడంతో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది.

దీంతో వైద్యులు కొన్నిరోజులపాటు ఆయన్ను ఐసీయూలో ఉంచి నాన్‌ ఇన్‌వాసివ్‌ వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. మధ్యలో ప్లాస్మా ట్రీట్మెంట్ కూడ ఇచ్చారు. 24 గంటలూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందడంతో మెల్లగా ఆయన ప్రమాదం నుండి బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారు. పరీక్షల్లో కోవిడ్ నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. దీంతో ఆయన్ను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. దీంతో సినీ ప్రేక్షకులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రాజశేఖర్ ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులూ జీవిత ఆయన శ్రేయోభిలాషుల కోసం ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ అప్డేట్స్ ఇస్తూ వదంతులకు తావు లేకుండా చేయడం అభునందనీయం.

తాజా వార్తలు