యాక్షన్ 3డికి క్రేజ్ తెస్తున్న హాట్ స్టిల్స్

యాక్షన్ 3డికి క్రేజ్ తెస్తున్న హాట్ స్టిల్స్

Published on Jun 16, 2013 3:10 PM IST

action_3d_movie
అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘యాక్షన్ 3డి’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబందించిన కొన్ని హాట్ స్టిల్స్ ని రిలీజ్ చేసారు. ఆ స్టిల్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఈ హాట్ స్టిల్స్ లో అల్లరి నరేష్, నీలం ఉపాధ్యాయ్ ని చూడొచ్చు. ఈ పాటని దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు స్టైల్లో తీసారు.

ఈ సినిమాలో అల్లరి నరేష్ తో పాటు కిక్ శ్యామ్, వైభవ్, రాజు సుందరంలు కూడా కనిపించనున్నారు. నీలం ఉపాధ్యాయ్, స్నేహ ఉల్లాల్, కామ్న జఠ్మలాని, రీతు బర్మేచ, శీన హీరోయిన్స్ గా కనిపించనున్నారు. అనిల్ సుంకర ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. బప్పి లహరి – బప్ప లహరి కలిసి సంగీతం అందించిన ఈ సినిమాని 2డి, 3డిలలో ఈ నెల 21 న రిలీజ్ చేస్తున్నారు.

తాజా వార్తలు