కామెడి కింగ్ అల్లరి నరేష్ నటించిన ‘యాక్షన్ 3డి’ సినిమా శాటిలైట్ హక్కులు జీ తెలుగు దాదాపు 3.5 కోట్లకు సొంతంచేసుకుంది. ఈ సినిమా ఈ నెల 21న విడుదలకు సిద్ధంగావుంది
‘యాక్షన్ 3డి’ సినిమాను 3డి పరిజ్ఞానంతో భారీ బడ్జెట్ లో తెరకెక్కించారు. అల్లరి నరేష్ కెరీర్లో ఇదే అత్యధిక బడ్జెట్. సుదీప్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు. బ్రహ్మానందం అల్లరి నరేష్ కు మామయ్యగా కనిపించనున్నాడు.
అల్లరి నరేష్, వైభవ్ రెడ్డి, శ్యామ్, నీలం ఉపాధ్యాయ, స్నేహా ఉల్లాల్ మరియు కామ్న జట్మలాని ప్రధాన పాత్రధారులు. బప్పా లహరి-బప్పి లహరి కలిసి సంగీతం అందించారు. ఈ సినిమా ఇండియాలో మొదటి కామెడీ 3డి సినిమా కావడంవల్ల భారీ అంచనాల నడుమ విడుదలకానుంది