కామెడీ కింగ్ అల్లరి నరేష్ హై కామెడీ ఎంటర్టైనర్ ‘యాక్షన్ 3డి’. ఈ సినిమాని మే 31న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2డి, 3డిలలో విడుదలవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘యాక్షన్ 3డి’ సినిమాలో సాంకేతిక విలువలు హై రేంజ్ లో ఉంటాయి.
ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర ఈ సినిమాని నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా చేసాడు. ఈ సినిమాకి మొత్తంగా 18 కోట్ల వరకూ ఖర్చయ్యింది, అల్లరి నరేష్ కెరీర్లోనే ఇదొక భారీ బడ్జెట్ చిత్రం. అల్లరి నరేష్ తో పాటుగా కిక్ శ్యాం, వైభవ్, రాజు సుందరం ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో నీలం ఉపాధ్యాయ్, స్నేహ ఉల్లాల్, కామ్న జఠ్మలాని, షీన హీరోయిన్స్ గా నటించారు. ఇండియా లోనే మొట్టమొదటి సారిగా తెరకెక్కిన కామెడీ 3డి చిత్రం ఇదే కావటం విశేషం. బప్పి లహరి – బప్పా లహరి ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.