భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కామెడి ఎంటర్ టైనర్ “యాక్షన్” 3D చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలు ఈ నెల 26 నుండి చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్ తో కలిసి వైభవ్, శ్యాం మరియు రాజ సుందరం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. “దూకుడు” చిత్ర నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర బృందం దాదాపుగా 100 గంటల పాటు విరామం లేకుండా సన్నివేశాలను చిత్రీకరిస్తూ వచ్చారు కావున రెండు రోజుల విరామం తీసుకున్న తరువాత చిత్రీకరణ తిరిగి మొదలు పెట్టనున్నారు. “ఈగ” ఫేం సుదీప్ ఈ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించనున్నారు. 2013 మొదట్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది