సెన్సార్ పూర్తిచేసుకున్న యాక్షన్ 3డి

సెన్సార్ పూర్తిచేసుకున్న యాక్షన్ 3డి

Published on Jun 13, 2013 12:00 PM IST

Action-3d

Updated : అల్లరి నరేష్ నటిస్తున్న ‘యాక్షన్ 3డి’ సినిమాకు సెన్సార్ పూర్తిచేసుకుంది.

కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటిస్తున్న’యాక్షన్ 3డి’ సినిమాకి ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాని సెన్సార్ వారు చూడటం జరుగుతోంది. ఈ సినిమాకి సెన్సార్ వారు ఈరోజు సాయంత్రంలోగా అధికారికంగా సెన్సార్ సర్టిఫికట్ జరిచేసే అవకాశం వుంది. ఈ సినిమాని ఈ నెల 21న విడుదలచేయనున్నారు. అల్లరి నరేష్, కిక్ శ్యాం, వైభవ్, రాజు సుందరంలు ఈ కామెడీ ఎంటర్టైనర్ లో ఫ్రెండ్స్ గా కనిపించనున్నారు. ‘ఈగ ఫేం’ సుదీప్ ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ఇండియాలోనే మొట్ట మొదటి 3డి కామెడీ సినిమా కావడం విశేషం. ఈ సినిమా 3డి అవుట్ పుట్ విభాగంలో కీత్ డ్రైవర్ పనిచేశారు. బప్పి లాహిరి – బప్పా లహరిలు సంగీతాన్ని అందించారు. ఈ సినిమాని 2డి, 3డి రెండు వర్షన్స్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంబందించిన సెన్సార్ సర్టిఫికేట్ విషయాలను కొద్ది గంటల్లో తెలియజేస్తాం.

తాజా వార్తలు