ఏప్రిల్ 20న ‘యాక్షన్ 3డీ’ ఆడియో విడుదల

ఏప్రిల్ 20న ‘యాక్షన్ 3డీ’ ఆడియో విడుదల

Published on Apr 15, 2013 6:41 PM IST
First Posted at 18:40 on Apr 15th

Action-(2)

కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటిస్తున్న భారీ బడ్జెట్ కామెడీ ఎంటర్టైనర్ ‘యాక్షన్ 3డి’. ఈ సినిమా ఆడియోని ఈ నెల 20న అనగా శనివారం సాయంత్రం ప్రసాద్ మల్టీప్లెక్స్ లో లాంచ్ చేయనున్నారు. ఈ వేడుకకి సినిమాలోనటించిన నటులు, సినీ ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖులు, సినీ హీరోలు హాజరుకానున్నారు. ఈ సినిమాకు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి, బప్పా లాహిరిలు సంగీతాన్ని అందించారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని అనిల్ సుంకర నిర్మిస్తూ, దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వైభవ్, ‘కిక్’ శ్యాం, రాజు సుందరంలు నటించారు. బ్రహ్మానందం ముఖ్యమైన పాత్రలో, అలాగే ‘ఈగ’ ఫేం సందీప్ అతిధి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో స్నేహ ఉల్లాల్, నీలం ఉపాధ్యాయ్, కామ్న జఠ్మలాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇంటర్నేషనల్ టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇండియాలోనే మొదటి కామెడీ 3డీ సినిమా కావడం విశేషం

తాజా వార్తలు