యాక్టింగ్ గురు మహేష్ గంగిమల్ల దర్శకత్వం లో అభివ్యక్తి ప్రారంభం

యాక్టింగ్ రీసర్చ్ సెంటర్ స్థాపించి ఎంతో మంది హీరో, హీరోయిన్లను , నటీనటులను సినీ పరిశ్రమకు అందించిన యాక్టింగ్ గురు మహేశ్ గంగిమల్ల సరికొత్త పాత్రను టాలీవుడ్‌లో పోషించేందుకు సిద్దమయ్యారు. తాజాగా తన స్వీయ దర్శకత్వంలో అభినయ జ్ఞాపిక ప్రొడక్షన్‌లో అభివ్యక్తి అనే టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాత , కొత్త నటీనటుల కలయికతో రూపొందిస్తున్నారు. జనవరి నుంచి షూటింగ్ జరుపుకోబుతున్న ఈ చిత్రంలో లలిత్ ఆదిత్య, మల్లేశం ఫేమ్ అనన్య నాగళ్ల , సాయి రాఘవేంద్ర, సుందర్, రమణ నటిస్తున్నారు.

అభివ్యక్తి చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. స్క్రిప్ట్ గురించి ముందే తెలుసు కాబట్టి , ఈ మంచి సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా అని అన్నారు. మా యాక్టింగ్ గురువే , దర్శకుడు అవడం మాకు ఆనందంగా ఉంది అని మిగితా నటీనటులు అన్నారు. అభివ్యక్తి చిత్రానికి అజగవాఆర్ట్స్ నిర్మాత భూపాల్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హీరో రాకేశ్ వర్రే క్లాప్ కొట్టాడు, యువ దర్శకుడు మాధవ్ కోదాడ్ గౌరవ దర్శకత్వం వహించారు.

Exit mobile version