ఆచార్య నుండి ఆ గిఫ్ట్ వచేస్తుంది..రెడీగా ఉండండి..!

ఆచార్య నుండి ఆ గిఫ్ట్ వచేస్తుంది..రెడీగా ఉండండి..!

Published on Jul 17, 2020 7:23 AM IST

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ సామాజిక అంశాలతో కూడిన మాస్ సబ్జెక్టుతో తెరకెక్కిస్తున్నారు. లాక్ డౌన్ ముందు వరకు ఆచార్య నిరవధిక షూటింగ్ జరుపుకోగా… 40శాతం వరకు పూర్తి అయినట్లు సమాచారం. కాగా ఈ మూవీ నుండి వచ్చే నెలలో భారీ అప్డేట్ రానుంది. మెగాస్టార్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆగస్టు 22న బిగ్ అప్డేట్ ఇస్తారట.

ఆరోజు ఆచార్య మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారట. అలాగే ఆచార్య టీజర్ కూడా వచ్చే సూచనలు కలవు. ఇక దీనిపై కొరటాల ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారట కొరటాల. షూటింగ్ బ్రేక్ కారణంగా ఖాళీగా ఉంటున్న కొరటాల ప్రత్యేక శ్రద్దతో ఫస్ట్ లుక్ సిద్ధం చేయిస్తున్నారట. ఇక ఆచార్య మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు