అభిషేక్, ఐశ్వర్య కంటే గొప్ప అంటోన్న రాము

అభిషేక్, ఐశ్వర్య కంటే గొప్ప అంటోన్న రాము

Published on Nov 18, 2011 6:19 AM IST

RGV Aishwarya Abhishek
ప్రతీ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకొనే ప్రతిభాశాలి రాంగోపాల్ వర్మ. ఆయన ఏది మాట్లాడినా అది ఓ సంచలనమే అవుతుంది. తాజాగా ఐశ్వర్య రాయ్ బేబీ గురించి ట్విట్టర్ ఒక పోస్టింగ్ ఇచ్చాడు రాము. ” ఆ బేబీ అభిషేక్ ఐశ్వర్య కంటే గొప్పది అని నేను భావిస్తున్నా” అని పేర్కొన్నాడు.

తాజాగా రాము చేసిన ఈ వ్యాఖ్య అందరి దృష్టినీ ఆకర్షించింది. బిడ్డ పుట్టినందుకు మొత్తం ఫిలిం ఇండస్ట్రీ ఐశ్వర్య – అభిషేక్ లను శుభాకాంక్షలతో ముంచెత్తుతుంటే, రాము మాత్రం విభిన్నమైన ప్రకటన తో వార్తల్లో నిలిచాడు. గతం లో కూడా ఐశ్వర్య అందం గురించి రాము వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అందమైన ఆడవాళ్ళు గర్భం ధరించటం తనకు అసహ్యమంటూ రాంగోపాల్ వర్మ సంచలన ప్రకటన కూడా చేసారు.

అయితే, రాము పోస్ట్ చేసిన ట్వీట్ ద్వేషపూరితమైంది కాకపోయినప్పటికీ, ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఐశ్వర్య కంటే ఆమె బిడ్డ ఇంకా అందగత్తె అయితే సంతోషమే కదా..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు