సరైన టైం కోసం చూస్తున్న అభిజీత్..అందుకే ఇలా.?

సరైన టైం కోసం చూస్తున్న అభిజీత్..అందుకే ఇలా.?

Published on Jan 2, 2021 12:00 PM IST

ఈసారి జరిగినటువంటి బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 టైటిల్ విన్నర్ గా అభిజీత్ నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే గత మూడు సీజన్ల తాలూకా ఏ విన్నర్ కు కూడా రాణి క్రేజ్ అభిజీత్ కు ఈ షో ద్వారా వచ్చింది. ఇక ఇదిలా ఉండగా మరి అలాంటి అభిజీత్ షో అయ్యాక ఇంకా ఎందుకు ఎలాంటి సినిమాలు ఒప్పుకున్నట్టు కనిపించడం లేదని ఓ ప్రశ్న అందరికీ వస్తుంది.

టాప్ 3లో ఉన్న సోహెల్ ఆల్రెడీ ఒక సినిమా ఒప్పుకున్నాడు మోనాల్ ఒక పక్క సినిమాలు చేస్తుంది మరోపక్క షోలు కమిట్ అయ్యింది. కానీ అభిజీత్ కు ఎందుకు ఇంకా ఎలాంటి అవకాశాలు రాలేదు అంటే అందుకు తానే కారణం అన్నట్టు తెలుస్తుంది. తాను మళ్ళీ సినిమాల్లో కం బ్యాక్ ఇస్తే ఒక సాలిడ్ సబ్జెక్టుతోనే ఇవ్వాలి అనుకుంటున్నాడని తెలుస్తుంది.

అందుకే ఇప్పుడు తనకు వస్తున్న చిన్నా చితకా ఆఫర్స్ ను వదులుకుంటున్నట్టు తెలుస్తుంది. అలాగే వెబ్ సిరీస్ ఆఫర్స్ ను కూడా అభిజీత్ స్కిప్ చేస్తున్నాడట. అందుకే సరైన టైం చూసి తన కం బ్యాక్ సాలిడ్ గా ఇవ్వాలని అభిజీత్ ఫిక్స్ అయ్యినట్టు టాక్. మరి అభిజీత్ ఎలాంటి సినిమాను ఓకే చేస్తాడో చూడాలి. ఏదైనా త్వరగా కమిట్ అయితేనే బెటర్ గా ఉంటుంది లేట్ అయితే మళ్ళీ మామూలే..

తాజా వార్తలు