కోనేరు వెంకట్ దర్శకత్వంలో వరుణ్ సందేశ్ మరియు హరి ప్రియలు ప్రధాన పాత్రలలో వస్తున్న “అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్” చిత్ర ఆడియో ను ఫిబ్రవరి 5న విడుఫ్హాల చెయ్యనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత చెబుతూ “అమ్మాయిలు సున్నితంగా ఉంటారు అందుకే కవులు పువ్వులతో పోలుస్తారు కాని మా చిత్రంలో అమ్మాయి మాత్రం గుంటూరు మిర్చి లా ఘాటుగా ఉంటుంది ఆమె దూకుడు ఏంటో తెర మీద చూడాల్సిందే” అని అన్నారు. సాయి కృష్ణ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఖ్యద్రి నిర్మిస్తున్నారు.ఫిబ్రవరిలోనే చిత్రాన్ని కూడా విడుదల చెయ్యాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు.