గౌరీతో ప్రేమ పై స్టార్ హీరో క్లారిటీ !

బాలీవుడ్‌ స్టార్ హీరో అమీర్ ఖాన్‌, గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తన కొత్త ప్రేమ గురించి అమీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇంతకీ, అమీర్ ఏం మాట్లాడారు అంటే.. ‘నేను గౌరీని కలవడానికి ముందు థెరపీ చేయించుకున్నాను. దాని తర్వాత, నన్ను నేను ప్రేమించుకోవడం మొదలు పెట్టాను. నా ఆరోగ్యంపై దృష్టిపెట్టాను. నా స్నేహితులు కూడా ప్రతి విషయంలోనూ మద్దతుగా నిలిచారు. నిజానికి నేను, గౌరీ అనుకోకుండా కలిశాం. ఆ తర్వాత స్నేహితులమయ్యాం’ అని అమీర్ చెప్పుకొచ్చారు.

అమీర్ ఇంకా మాట్లాడుతూ.. ‘మా మధ్య మొదట్లో ఓన్లీ స్నేహం మాత్రమే ఉంది. కొన్నేళ్ల తర్వాత మా మధ్య ప్రేమ పుట్టింది. నాకు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. వారందరితో రోజంతా గడుపుతాను. భాగస్వామి అవసరం లేదని భావించేవాడిని. కానీ, ఇప్పుడు గౌరీతో ఉండాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మా మధ్య నిజమైన ప్రేమ ఉంది. మేం భార్యాభర్తలు కాకపోవచ్చు.. కానీ, ఎప్పటికీ కుటుంబంగానే ఉంటాం’’ అని అమీర్ ఖాన్ తెలిపారు. పైగా ఏడాదిన్నర నుంచి ఆమెతో డేటింగ్‌లో ఉన్నట్లు కూడా అమీర్ తెలిపాడు.

Exit mobile version