రేపు తెలుగు, తమిళ భాషలలొ నాని నటించిన ‘ఆహా కళ్యాణం’ విడుదలకానుంది. గతకొన్ని వారాలుగా ఈ సినిమా బృందం ప్రచారంలో పాల్గుంది. మరీ ముఖ్యంగా నాని పరాయి సినిమాలతో కంపార్ చేస్తూ అవేవీ మా సినిమాకు అడ్డురావని సెలవిస్తున్నాడు
“బ్యాండ్ భాజా భారత్ సినిమాకు ఇది నిక్కచ్చిగా చెప్పుకునే రీమేక్. మా కష్టాన్ని మీరు ఆనందిస్తారని కోరుకుంటున్నా” అని తెలిపాడు. తమిళ వర్షన్ కి కూడా నానినే శాంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. మమోలుగా డబ్బింగ్ వారంరోజులలో ముగించే నాని ఈసారి స్వర ఉచ్ఛారణ కోసం తమిళ వర్షన్ కు ఎక్కువ రోజులు వెచ్చించాడట
నాని సరసన వాణి కపూర్ జంటగా నటిస్తుంది. గోకుల్ కృష్ణ దర్శకుడు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాత