మొదలైన ఆగడు మ్యూజిక్ సిట్టింగ్స్

Mahesh-Srinu-Vaitla
శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు నటించబోతున్న ‘ఆగడు’ సినిమా త్వరలో మొదలుకానుంది. అయితే ఇప్పటికే దర్శకుడు సినిమాకు అవసరమైన అంశాల మీద దృష్టి పెట్టాడు. ఊటీలో ఇప్పటికే కధాచర్చలు ముగిసాయి. యాక్షన్, కామెడీ సమపాళ్ళలో వున్నా స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. తాజా సమాచారం ప్రకారం థమన్ ఈ సినిమాకు సంగీతం మొదలుపెట్టాడట. ‘దూకుడు’ సినిమాకు అందించినట్టే ఈ చిత్రానికీ మరో బ్లాక్ బస్టర్ ను అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన తమన్నా నటించనుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర, గోపీచంద్, రామ్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు

Exit mobile version