ఒక్క హైదరాబాద్లోనే 100కి పైగా థియేటర్లలో బాద్షా

Baadshah1
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘బాద్షా’ సినిమా ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ‘బాద్షా’ సినిమా మొదటి రోజు హైదరాబాద్లో సుమారు 100 కి పైగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు, కానీ థియేటర్స్ లిస్టు ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఈ సినిమాకి భారీ క్రేజ్ ఉండడం, సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మొదటి చిత్రం కావడం, అలాగే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమా థియేటర్ల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.
ఎన్.టి.ఆర్ సరికొత్త స్టైలిష్ అవతారంలో కనిపిస్తున్న ఈ సినిమాలోని రెండు పాటల్లో డాన్సులు కూడా సూపర్బ్ గా వేశారని ఇదివరకే తెలిపాము. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో ఆల్బమ్ సూపర్ హిట్ అయ్యింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మించాడు.

Exit mobile version