మొత్తం 40 ట్రాక్స్.. ‘ఓజి’ బీట్స్ తో మళ్ళీ ఊచకోతే అంటున్న థమన్!

మొత్తం 40 ట్రాక్స్.. ‘ఓజి’ బీట్స్ తో మళ్ళీ ఊచకోతే అంటున్న థమన్!

Published on Nov 15, 2025 9:00 AM IST

OG

మన టాలీవుడ్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన సాలిడ్ హిట్ చిత్రం ఓజి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రమే ఇది. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన వర్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. తాను మీసం తిప్పి సమాధానం చెబుతున్నామని కాన్ఫిడెన్స్ గా స్టేట్మెంట్ ఇచ్చి అన్నంత పని చేసాడు.

మరి దీనితో మొదటి నుంచీ ఓజి ఓఎస్టి (ఒరిజినల్ సౌండ్ ట్రాక్) పై క్రేజీ బజ్ నెలకొనగా ఫైనల్ గా చేసేందుకు సిద్ధం చేశారు. మన తెలుగు సినిమా హిస్టరీ లోనే ఏ సినిమాకి రాని హైయెస్ట్ నెంబర్ ట్రాక్స్ వచ్చినట్టు తెలిపాడు. మొత్తం 40 సౌండ్ ట్రాక్స్ బీట్స్ ఓజి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేందుకు వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. ఇక ఈ 16న రానున్న ఓఎస్టి ఎలాంటి ట్రీట్ అందిస్తుందో చూడాలి మరి.

తాజా వార్తలు