ఫ్యామిలీ మరియు ప్రేమ మధ్య నలిగిపోయే ఓ కుర్రాడి కథ

ఫ్యామిలీ మరియు ప్రేమ మధ్య నలిగిపోయే ఓ కుర్రాడి కథ

Published on Aug 26, 2012 1:43 AM IST


ఎప్పుడైనా ఒకానొక కఠినమైన మరియు బాధాకరమైన సందర్భంలో మీ అందమైన కుటుంబం మరియు మీరు ప్రేమించిన అమ్మాయిలలో ఎవరో ఒకరినే ఎంచుకోమంటే మీరు ఎవర్ని ఎంచుకుంటారు? సందర్భాన్ని బట్టి కచ్చితంగా ఏదో ఒక నిర్ణయానికి రావాలి. ఇలాంటి ఇబ్బందినే నారా రోహిత్ తన రాబోయే ‘ఒక్కడినే’ సినిమాలో ఎదుర్కొంటాడు. నిత్యా మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తన కుటుంబం మరియు తన ప్రేమ మధ్య నలిగిపోయే కుర్రాడి పాత్రను నారా రోహిత్ పోషించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రానికి శ్రీనివాస్ రాగా దర్శకత్వం వహించారు. సి.వి రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ సంగీతం అందించారు. ఈ చిత్రం యొక్క ఆడియోను కూడా సెప్టెంబర్లోనే విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు