‘రామాయణ’ రెండు భాగాలకి షాకింగ్ బడ్జెట్..

‘రామాయణ’ రెండు భాగాలకి షాకింగ్ బడ్జెట్..

Published on Jul 15, 2025 7:00 AM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “రామాయణ” కోసం అందరికీ తెలిసిందే. రాకింగ్ స్టార్ యశ్ కూడా నటిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా అనౌన్స్ అయ్యాక మరిన్ని అంచనాలు సెట్ చేసుకుంది.

అయితే రామాయణ రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా ఇన్ని రోజులు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు రెండు భాగలకి కూడా రివీల్ అయ్యిన బడ్జెట్ అందరికీ షాకిస్తుంది. నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ సినిమాకి అక్షరాల 4000 వేల కోట్లు బడ్జెట్ ని పెడుతున్నట్లు తెలిపారు.

రెండు భాగలకి కలిపి ఇంత మొత్తం అంటే మన ఇండియన్ సినిమా దగ్గరే ఒక ఊహించని మొత్తం బడ్జెట్ అని చెప్పాలి. ఈ మొత్తాన్ని సినిమా రాబడుతుందో లేదో అనేది ప్రస్తుతానికి పక్కన పెడితే ఈ బడ్జెట్ విన్న నెటిజన్స్ మాత్రం కళ్ళు తేలేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు