‘యజ్ఞం’ సినిమాతో సూపర్ హిట్ అందుకొని తన టాలెంట్ నిరూపించుకున్న దర్శకుడు ఎ.ఎస్ రవికుమార్ చౌదరి. ఆయన తీసిన గత చిత్రాలు వరుసగా పరజయాన్ని పాలైనప్పటికీ ప్రస్తుతం తను చేస్తున్న సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ప్రస్తుతం రవికుమార్ చౌదరి సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు – అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తారు. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న రవికుమార్ చౌదరి మీడియాతో కాసేపు ముచ్చటించారు. ‘ నా చివరి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాను. చాలా కథలు రాసుకున్నా కానీ ఓ మంచి కథతోనే రావాలని ఇంత విరామం తీసుకున్నాను. ప్రస్తుతం నేను సాయి ధరమ్ తేజ్ తో చేస్తున్న సినిమా చాల అకోట్టగా ఉంటుంది. స్క్రీన్ ప్లే పరంగా ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందని’ ఆన్నాడు.
అలాగే మాట్లాడుతూ ‘ మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టు మన స్టైల్ కూడా మారాలి. యూత్ ని బాగా ఆకట్టుకునే సినిమాలు,అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా ఉండాలి. ఇక నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తాను. వచ్చే సంవత్సరం నా డైరెక్షన్ లో నితిన్ తో సినిమా ఉంటుందని’ తెలిపాడు.
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఎఎస్ రవికుమార్ చౌదరికి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.