రాజమౌళి భవిష్యత్తులో కొత్త రకమైన చిత్రాలు తీస్తాడు : కీరవాణి


ఎం.ఎం కీరవాణి తెలుగు చలన చిత్ర రంగంలో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మరియు పెద్ద దర్శకుల అందరితోనూ పనిచేసిన లెజెండ్రీ సంగీత దర్శకుడు. టాలీవుడ్ అగ్ర దర్శకుడయిన రాజమౌళిని చిన్నతనం నుంచి గమనిస్తున్న ఈ సంగీత దర్శకుడు రాజమౌళి మొదటి చిత్రం ‘ స్టూడెంట్ నెం.1’ నుండి ఇప్పుడు రాబోతున్న గ్రాఫికల్ మానియా మూవీ ‘ ఈగ’ వరకు అన్ని చిత్రాలకు కీరవాణి గారే సంగీతాన్ని అందించారు. ఒక ప్రముఖ న్యూస్ పేపర్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి ఇలా అన్నారు.

” చిన్న తనం నుంచి రాజమౌళిని చూస్తున్నాను, రోజు రోజుకీ సినిమాల విషయంలో తనలో అవధులు లేని మార్పులు గమనించానని ఆయన అన్నారు. అన్ని హిట్ సినిమాలు తీసినా ఇప్పటికీ సినిమాల మీద తనకున్న ఇష్టం ఏ మాత్రం తగ్గలేదని, అలాగే సినిమాలు తీయడంలో నాలెడ్జ్ మరియు టెక్నికల్ విషయాల గురించి ఎంతో నేర్చుకున్నాడని ఆయన తెలిపారు. ‘మగధీర’ వరకూ రొటీన్ కమర్షియల్ సినిమాలే తీసిన రాజమౌళి ‘ మర్యాద రామన్న’ చిత్రం నుంచి తన పంథాని మార్చుకున్నాడని అయన అన్నారు. భవిష్యత్తులో రాజమౌళి నుండి కొత్త రకమైన సినిమాలు వస్తాయని ఆయన అన్నారు”.

రాజమౌళి ‘ఈగ’ చిత్రం కోసం ఎంత కష్టపడ్డారో ఆయన తెలిపారు, అలాగే హీరో అనే ఇమేజ్ లేకుండా తను తీసిన ‘ఈగ’ చిత్రానికి సంగీతం అందించేటప్పుడు ఒక ప్రత్యేక అనుభూతికి లోనయ్యారని ఆయన తెలిపారు. ‘ఈగ’ సినిమా జూలై-06న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్దమవుతోంది.

Exit mobile version