ప్రేమికుల రోజు చైతూ-సాయి పల్లవి ల గిఫ్ట్

ప్రేమికుల రోజు చైతూ-సాయి పల్లవి ల గిఫ్ట్

Published on Feb 7, 2020 5:45 PM IST

నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరింది. ప్రస్తుతం ఈ మూవీ చివరి షెడ్యూల్ తెలంగాణా లోని ఆర్మూర్ నందు జరుగుతుంది. దీనితో షూటింగ్ పార్ట్ పూర్తి కానుందని సమాచారం. కాగా ఈనెల 14న ఈ మూవీ నుండి ఓ ఆహ్లాదకరమైన లవ్ సాంగ్ ని విడుదల చేయనున్నారట. ప్రేమికుల రోజును పురస్కరించుకొని లవ్ స్టోరీ నుండి ఓ సాంగ్ విడుదల చేయనున్నట్లు తెలుస్తున్న సమాచారం.

లవ్ స్టోరీ టైటిల్ పోస్టర్ ఇటీవలే విడుదల చేయగా మంచి ఆదరణ దక్కింది. ఇక ఈ మూవీని నారాయణ కె నారంగ్, పి రామ్ మోహన్ రావ్ నిర్మిస్తున్నారు. సంగీతం పవన్ సి హెచ్ అందిస్తున్నారు. లవ్ స్టోరీ మూవీ 2020 ఏఫ్రిల్ 2న గ్రాండ్ గా విడుదల కానుంది.

తాజా వార్తలు