ప్రభాస్ ఫ్యాన్స్ కు కిల్లర్ ఫీస్ట్ రెడీ అంటున్న నాగశ్విన్.!

ప్రభాస్ ఫ్యాన్స్ కు కిల్లర్ ఫీస్ట్ రెడీ అంటున్న నాగశ్విన్.!

Published on Oct 7, 2020 1:59 PM IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మొత్తం మూడు భారీ ప్రాజెక్టులను లైన్ లో ఉంచిన సంగతి తెలిసిందే. వాటిలో ప్రతీ దానిపైనా కూడా ఒకదాన్ని మించిన అంచనాలు మరొక దానిపై నెలకొన్నాయి. అయితే ప్రభాస్ మరియు నాగశ్విన్ ల ప్రాజెక్ట్ పై మాత్రం డార్లింగ్ అభిమానులు కాస్త స్పెషల్ అంచనాలు పెట్టుకున్నారు.

ఇక ఈ అక్టోబర్ నెలలో ప్రభాస్ నటిస్తున్న మూడు చిత్రాలకు సంబంధించి ఏదొక అప్డేట్ రావడం ఖాయం అని ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికే బ్లైండ్ గా ఫిక్స్ అయ్యిపోయారు. అందులో భాగంగా ఇప్పటికే మేకర్స్ కు ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా వాటిలో నాగశ్విన్ రెస్పాండ్ అయ్యి ఒక గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ ను అందించాడు.

మొదటగా బ్యాడ్ న్యూస్ ఏమిటంటే ప్రభాస్ పుట్టినరోజుకు తన నుంచి ఎలాంటి అప్డేట్ ఉండడదని ఎందుకంటే తాము ఇంకా ఎలాంటి షూట్ ను ప్రారంభించలేదని అందుకే ఇప్పుడప్పుడే రివీల్ చేయలేనని తెలిపారు.

ఇక గుడ్ న్యూస్ ఏమిటంటే ఒక కిల్లర్ అప్డేట్ ను మాత్రం ప్రభాస్ పుట్టినరోజు కంటే ముందు గానే రెడీగా ఉందని మంచి కిక్కిచ్చారు. ఒకింత నిరాశపరిచిన అంతకు మించిన కిక్ ను వెంటనే ఇచ్చేసారు. మరి ఆ అప్డేట్ ఏంటో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చెయ్యక తప్పదు.

తాజా వార్తలు