మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా దేవాలయాలకు సంబంధించి ఓ పవర్ ఫుల్ సబ్జెక్టుతో వస్తుందని అని మనం విన్నాము. కానీ లేటెస్ట్ గా బయటకొచ్చిన టాక్ ప్రకారం ఈ చిత్రంలో వేసిన ఓ సెట్ హిస్టరీనే నమోదు చేసినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలోని ఒక దేవాలయం టౌన్ సెట్ ను నిర్మించారట. దానికి గాను ఏకంగా 20 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ఇలాంటి సెట్టింగ్ మన ఇండియన్ సినిమాలోనే ఏ చిత్రానికీ వెయ్యనట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సెట్టింగ్ ను 20 ఎకరాల విస్తీర్ణంలో వేసారట అంటే ఏ రేంజ్ సెట్టింగ్ ను ఈ చిత్రం కోసం వేసారో మనం అర్ధం చేసుకోవచ్చు.
దాదాపు సినిమా షూటింగ్ అంతా కూడా ఇక్కడే జరుగుతుందట. మరి ఈ సెట్ అలా ఉంటుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు. ఈ చిత్రంలో చిరుతో పాటుగా చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అలాగే మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.