హిందీలో ‘మహావతారా నరసింహ’కి క్రేజీ ఓపెనింగ్స్!

mahavatara-narasimha

లేటెస్ట్ గా ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబళే ఫిలిమ్స్ నుంచి రిలీజ్ కి వచ్చిన యానిమేషన్ యాక్షన్ అండ్ డివోషనల్ చిత్రమే “మహావతారా నరసింహ”. పాన్ ఇండియా భాషల్లో ప్లాన్ చేసి రిలీజ్ కి తీసుకొచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక అన్ని భాషలు నుంచి క్రేజీ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే అనూహ్యంగా ఈ సినిమాకి హిందీలో ఒక సాలిడ్ ఓపెనింగ్స్ రావడం అనేది విశేషం.

మొదటి రోజే హిందీ వెర్షన్ కి గాను 2 కోట్లకి పైగా నెట్ వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజుకి గాను 2.45 కోట్ల నెట్ వసూళ్లు అందుకున్న ఈ సినిమా ఇక వీకెండ్ లో మరింత జంప్ ని అందుకుంటుంది అని తెలుస్తుంది. ఒక యానిమేషన్ సినిమాకి అది కూడా హిందీలో ఇది గట్టి ఓపెనింగ్ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ సంగీతం అందించగా సామ్ సి ఎస్ సంగీతం అందించారు.

Exit mobile version