ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రంపై క్రమక్రమంగా మంచి అంచనాలు నెలకొంటున్నాయి. అయితే ఈ చిత్రాన్ని కంప్లీట్ గా ఒక ప్యూర్ వింటేజ్ లవ్ స్టోరీలా తెరకెక్కిస్తున్నారు. అలాగే కొన్ని రోజుల కితమే ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఏమీ పెద్దగా ఉండవని స్వయంగా ప్రభాసే తెలిపారు.
కేవలం ఒకే ఒక్క సీక్వెన్స్ ఉంటుంది తెలిపారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం మేకర్స్ ఈ సీక్వెన్స్ కోసం పలు భారీ హాలీవుడ్ చిత్రాలకు ఐకానిక్ యాక్షన్ సన్నివేశాలను అందించిన స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ తో చేయించినట్టుగా టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కానీ బహుశా ప్రభాస్ చెప్పిన ఆ ఒకే ఒక్క యాక్షన్ సీక్వెన్స్ అయితే థియేటర్స్ లో విట్నెస్ చెయ్యాల్సిందే అని చెప్పాలి.