ఎలాంటి జానర్ సినిమాలు అయినా అద్భుతంగ రక్తి కట్టించే దర్శకుడు గుణశేఖర్. అయితే తన సినిమాలకు ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకున్న ఈ సీనియర్ దర్శకుడు ఫైనల్ గా మరో ప్రతిష్టాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టారు అదే “శాకుంతలం”. మహాభారతంలోని ఓ అద్భుత ఘట్టం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంపై మంచి హైప్ నెలకొంది.
మరి ఇక ఈ భారీ చిత్రం నుంచి ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఉందనున్నట్టుగా మేకర్స్ చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు తమ నుంచి ఓ అప్డేట్ ను రివీల్ చేస్తున్నామని తెలుపుతున్నారు. మరి ఈ మైథలాజికల్ వండర్ నుంచి వీరు ఏం రివీల్ చేయనున్నారో చూడాలి. ఇప్పటికే ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంతా భాగస్వామ్యం కానుంది అని టాక్ వినిపిస్తుంది. మరి ఆ రిలేటెడ్ గా ఏమన్నా చెప్తారా లేక వేరే ఏమన్నా ఉందా అన్నది చూడాలి.
We’d have to keep you waiting for a little while longer.. please bear with us!
Big reveal at 5pm This evening!#Shaakuntalam ????#EpicLoveStory #MythologyForMillennials@Gunasekhar1 @neelima_guna #ManiSharma @GunaaTeamworks pic.twitter.com/ZWP1pwnGR9— Gunaa Teamworks (@GunaaTeamworks) January 1, 2021