OTT: ప్రైమ్ వీడియో షాకింగ్ టర్న్.. టాలీవుడ్ చిన్న నిర్మాతలు టెన్షన్?

OTT: ప్రైమ్ వీడియో షాకింగ్ టర్న్.. టాలీవుడ్ చిన్న నిర్మాతలు టెన్షన్?

Published on Jun 15, 2025 12:59 AM IST

ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులర్ అయ్యినటువంటి స్ట్రీమింగ్ యాప్స్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఒకటి. ముఖ్యంగా మన దేశంలో కూడా ప్రైమ్ వీడియో వినియోగదారులు ఎక్కువే ఉంటారు. అయితే ప్రైమ్ వీడియో ఒకప్పుడు వార్షిక ప్లాన్ గా 999 రూపాయలు ఉండేది. ఆ మొత్తం చెల్లించి ఏడాది పాటుగా కొత్త కొత్త సినిమాలు వెబ్ సిరీస్ లు లాంటివి చూసే వెసులుబాటు ఉండేది. కానీ నెమ్మదిగా దానిని 1499 చేశారు.

పోనీ ఇక్కడ నార్మల్ యాడ్స్ వేసి ఇందులో మళ్ళీ రెంటెడ్ కంటెంట్ అంటూ దానికి ఇంత మొత్తం చెల్లించాలని తీసుకొచ్చారు. దాదాపు ఈ స్టెప్ తీసుకొని రెండు మూడేళ్లు అవుతుంది కానీ ఇప్పుడు జూన్ 17 నుంచి ఏకంగా 6 నిమిషాల యాడ్స్ అది కూడా స్కిప్ చేయడానికి వీలు లేని విధంగా తీసుకొస్తున్నారట.

ఇది ఆల్రెడీ ఆ 1499 చెల్లించినవారికి కాగా దీని నుంచి మినహాయింపు కావాలి అంటే మళ్ళీ అదనంగా ఏడాదికి అయితే 699 నెలకి అయితే 129 చెల్లించాలట. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో వినియోగదారులకి పెద్ద దెబ్బ అయితే వారితో పాటుగా టాలీవుడ్ లో చిన్న నిర్మాతలకి కూడా ఇబ్బందిగా మారేలా ఉందట.

ఇది వరకు ప్రైమ్ వీడియోలో చిన్న నిర్మాతల సినిమాలకి స్ట్రీమ్ అయ్యే నిమిషాల ఆధారంగా రెవెన్యూ షేర్ ఉండేది అట. ఇక ఇప్పుడు 6 నిమిషాల యాడ్స్ అంటే చూసే వీక్షకుడు కూడా వాటిపై ఇంట్రెస్ట్ చూపించడు. దీనితో వారు కొంచెం టెన్షన్ లో ఉన్నారని సినీ వర్గాల్లో టాక్. మరి ప్రైమ్ వీడియో తీసుకొస్తున్న ఈ షాకింగ్ టర్న్ వారికి లాభం చేకూరుస్తుందా నష్టం చేకూరుస్తుందా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు