టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన ‘8 వసంతాలు’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ సినిమాలో మ్యాడ్ ఫేమ్ బ్యూటీ అనంతిక సనిల్‌కుమార్, రవి దుగ్గిరాల లీడ్ రోల్స్‌లో నటించారు.
బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 11 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.
ఇక ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందించగా హను రెడ్డి, కన్నా పసునూరి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.