71వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. తెలుగు బెస్ట్ ఫిల్మ్ ‘భగవంత్ కేసరి’

71వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. తెలుగు బెస్ట్ ఫిల్మ్ ‘భగవంత్ కేసరి’

Published on Aug 1, 2025 7:05 PM IST

Natinal Awards

భారత ప్రభుత్వం ప్రకటించే జాతీయ చలనచిత్ర అవార్డులు చాలా ప్రత్యేకం. ప్రతిఏడాది ఇచ్చే ఈ అవార్డులు సినిమా రంగానికి బూస్ట్ అందిస్తుంటాయి. అయితే, తాజాగా 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. ఇక ఈ అవార్డుల ప్రకటనలో పలు తెలుగు సినిమాలు కూడా సత్తా చాటాయి. వాటిలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి బెస్ట్ తెలుగు చిత్రం అవార్డు దక్కింది.

ఇక బెస్ట్ లిరిక్స్‌గా బలగం చిత్రంలోని ఊరు పల్లెటూరు పాటకు గాను కాసర్ల శ్యామ్ ఈ అవార్డు అందుకున్నారు. బేబి, హనుమాన్ వంటి చిత్రాలు కూడా ఈ అవార్డుల్లో దుమ్ములేపాయి. కాగా ఈ అవార్డుల్లో ఏయే క్యాటగిరిలో ఏయే సినిమాకు అవార్డు లభించిందో ఇక్కడ చూద్దాం.

నాన్-ఫీచర్ విభాగం విజేతలు :
ఉత్తమ డాక్యుమెంటరీ (నాన్-ఫీచర్): గాడ్ వల్చర్ అండ్ హ్యూమన్ (ఇంగ్లీష్, హిందీ, తెలుగు)
ఉత్తమ స్క్రిప్ట్ (నాన్-ఫీచర్): సన్‌ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ)
ఉత్తమ వాయిస్ ఓవర్ / నరేషన్: ది స్కేడ్ జాక్ – ఎక్స్‌ప్లోరింగ్ ది ట్రీ ఆఫ్ విశెస్ (ఇంగ్లీష్)
ఉత్త‌మ మ్యూజిక్ డైరెక్ట‌ర్ : ది ఫ‌స్ట్ ఫిల్మ్ ( హిందీ)
ఉత్త‌మ ఎడిటింగ్ : మూవీంగ్ ఫోక‌స్ ( ఇంగ్లీష్‌)
బెస్ట్ సౌండ్ డిజైన్ : దుంద‌గిరి కే పూల్ (హిందీ)
బెస్ట్ సినిమాటోగ్ర‌ఫీ : లిటిల్ వింగ్స్ ( త‌మిళం)
ఉత్తమ దర్శకత్వం (నాన్-ఫీచర్): పీయూష్ ఠాకూర్ – ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)

ఫీచర్ ఫిల్మ్ విభాగం విజేతలు :
ఉత్తమ తమిళ చిత్రం : పార్కింగ్
ఉత్తమ తెలుగు చిత్రం : భగవంత్ కేసరి
ఉత్తమ్ స్క్రీన్ ప్లే – బేబీ (సాయి రాజేష్ నీలం (షేరింగ్))
ఉత్తమ చిత్రం యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ గేమింగ్ కామిక్ – హనుమాన్
ఉత్తమ నటి – రాణి ముఖర్జి
ఉత్తమ నటుడు – షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సె
బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్- బేబీ (పివిఎన్ఎస్ రోహిత్)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సుకృతి వేణి (సుకుమార్ కుమార్తె) – గాంధీ తాత చెట్టు
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ : 12th ఫెయిల్

తాజా వార్తలు