మరో 6 నిమిషాల నిడివి పెరగనున్న పవన్ ‘అత్తారింటికి దారేది’

Attarintiki_Daredi_Latest_W

కొన్ని రోజుల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో కొన్ని సీన్స్ జత చేయనున్నారని తెలియజేశాం. ఈ రోజు ఈ చిత్ర ప్రొడక్షన్ టీం అధికారికంగా 6 నిమిషాల సీన్స్ సినిమాలో యాడ్ చేయనున్నారు. దీపావళి కానుకగా ఈ యాడ్ చేసిన సీన్స్ ని మీరు ఈ నెల 31 నుంచి థియేటర్స్ లో చూడొచ్చు.

ఇటీవలే ‘మగధీర’ రికార్డ్స్ బ్రేక్ చేసిన అత్తారింటికి దారేది ఇండస్ట్రీ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా రికార్డ్ సాధించింది. ఇప్పటికీ అత్తారింటికి దారేది సినిమాకి కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో ప్రణిత, నదియా, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో కనిపించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

Exit mobile version