ఈ ఏడాది సమంత చాలా ఆసక్తికరంగా గడిపింది అనే చెప్పాలి. “దూకుడు” చిత్రం భారీ విజయం తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఈగ” చిత్రం విజయంతో ఈ ఏడాదిని మొదలు పెట్టింది. ఇదే చిత్రం తమిళంలో “నాన్ ఈ” గా విడుదలయ్యింది. అక్కడ విజయం సాదించింది, తమిళంలో ఇదే తన తొలి విజయం. ఈ ఏడాది మొదట్లో సిద్దార్థ్ – నందిని రెడ్డి చిత్రం, “ఎవడు”, “ఎటో వెళ్లిపోయింది మనసు”, “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” మరియు “ఆటోనగర్ సూర్య” చిత్రాలను దక్కించుకుంది. మణిరత్నం “కడల్” మరియు శంకర్ “ఐ” చిత్రాలలో నటించాల్సి ఉండగా ఆమె అనారోగ్య కారణంగా దూరమయ్యింది. అదే కారణంగా రామ్ చరణ్ సరసన “ఎవడు” చిత్రం లో నటించే అవకాశం కూడా కోల్పోయింది. ప్రస్తుతం అన్ని చిత్రాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ నటి “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రంలో తన పాత్రకు వచ్చిన ప్రశంసలను ఆస్వాదిస్తుంది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా ట్విట్టర్లో ప్రకటించింది. వచ్చే ఏడాది ఆమె చెయ్యనున్న చిత్రాల లిస్టు చూస్తే చాలా ఆసక్తికరమయిన చిత్రాలను చేస్తున్నట్టే కనిపిస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన ఒక చిత్రం, ఎన్టీఆర్ సరసన హరీష్ శంకర్ దర్శకత్వంలోను మరియు సంతోష్ శివన్ దర్శకత్వంలో ఒక్కో చిత్రం, సూర్య సరసన మరో చిత్రం చెయ్యనున్నారు. ఈ ఎడాదిలానే ఈ భామకు వచ్చే ఏడాది కూడా కలిసి రావాలని కోరుకుందాం.